News December 15, 2025
ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మూడో విడతలో 4 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
Similar News
News December 19, 2025
TU: సౌత్ క్యాంపస్‌ను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

భిక్కనూరు మండల పరిధిలోని టీయూ సౌత్ క్యాంపస్‌ను శుక్రవారం జిల్లా డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డా.శిరీష తనిఖీ చేశారు. బాలుర వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనాలను మోతాదుకు అనుగుణంగా ఉపయోగించాలన్నారు. నాణ్యమైన సరుకులు వాడాలని, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని వార్డెన్ డా.యాలాద్రికి సూచించారు. క్యాంపస్‌లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News December 19, 2025
నరసరావుపేట: EVM గోడౌన్ భద్రతను పర్యవేక్షించిన కలెక్టర్

నరసరావుపేట స్థానిక మార్కెట్ యార్డులోని EVM గోడౌన్‌లను కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. EVM, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సెక్యూరిటీ లాగ్ బుక్‌ను తనిఖీ చేశారు. గోడౌన్ల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పటిష్ఠమైన భద్రత కొనసాగించాలని ఆమె అధికారులను ఆదేశించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 19, 2025
సుపరిపాలన వారోత్సవాలు ప్రారంభం: కలెక్టర్

ఈ నెల 25 వరకు జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ‘గ్రామాల వైపు పరిపాలన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


