News December 12, 2025
ఎన్నికల విధులకు మినహాయింపు లేదు: డీఈవో

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎలాంటి మినహాయింపు లేదని డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ నెల 13న ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని ఆదేశించారు. కొందరికి మినహాయింపు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
PPM: వాళ్లందరికీ స్మార్ట్ ఫోన్లు అందజేత

పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, బీపీసీలకు కూటమి 5జీ మొబైల్స్‌ను అందించనుంది. ఈ సెల్ ఫోన్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు అందజేయనున్నారు. జిల్లాలో 2,075 మంది అంగన్వాడీలు, 84 మంది సూపర్‌వైజర్లు, పది మంది బీపీసీలు ఉన్నారు. విధుల్లోని ఆన్‌లైన్ పనులకు ఆటంకం కలగకుండా ఈ కొత్త ఫోన్లను అందజేస్తున్నారు.
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
NZB: మద్యం దుకాణాలు బంద్

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.


