News January 19, 2026

ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా ఇవ్వండి.. SECకి సర్కార్ లేఖ

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లకు ఆమోదంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం తరఫున సీఎస్ లేఖ రాశారు. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన రిజర్వేషన్ల జాబితాను SECకి పంపారు. దీంతో ఎన్నికలకు ప్రభుత్వం తరఫున ప్రక్రియ ముగిసింది. అటు ఎస్ఈసీ ఇప్పటికే డ్రాఫ్టు షెడ్యూల్‌‌ను సీఎంకు అందించింది. దీనికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Similar News

News February 13, 2026

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఎల్లుండి ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక కొలంబోకు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 50-65% ఉందని Accuweather అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని సమాచారం. ఈనెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక IMD చెప్పడం గమనార్హం.

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికల్లో 2 బ్యాలెట్లు.. ఎందుకు?

image

బంగ్లాదేశ్ <<19125261>>ఎన్నికలు<<>> 2 బ్యాలెట్లతో జరిగాయి. అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక బ్యాలెట్ పేపర్, ‘జులై ఛార్టర్’పై రెఫరెండానికి రెండోది. 2025 అక్టోబర్‌లో 25 పార్టీలు చేసుకున్న ఒప్పందమే జులై ఛార్టర్‌. దీన్ని అమలు చేయాలని మెజారిటీ(65%పైగా) ప్రజలు ఓటు వేసినట్లు సమాచారం. PM పదవీ కాలంపై పరిమితులు, EC బలోపేతం, PM నుంచి ప్రెసిడెంట్‌కు అధికారాల బదిలీ వంటివి ఇందులో ఉన్నాయి. 180 పని దినాల్లో ఈ సంస్కరణలు అమలు చేయాలి.

News February 13, 2026

ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

image

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.