News April 21, 2024

ఎన్నికల సంఘం CEOగా ఏకైక మహిళ.. మన ఏలూరు వాసే

image

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇప్పటివరకు 25 మంది CEOలుగా పనిచేశారు. అందులో ఇప్పటివరకు ఒక్క మహిళకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. ఆమె ఎవరో కాదు.. మన ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన వీఎస్. రమాదేవి. HYDలో చదువుకున్న ఆమె సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లోనూ పనిచేశారు.1990 నవంబర్ 26న CEOగా బాధ్యతలు చేపట్టిన ఆమె అదే ఏడాది డిసెంబర్ 11 వరకు 16 రోజుల పాటు పదవిలో ఉన్నారు.

Similar News

News November 30, 2024

పాలకోడేరు: వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి

image

అప్పు ఇచ్చి అడిగినందుకు వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన రేష్మతో పాలకోడేరుకు చెందిన బాలకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంలో దఫాల వారీగా 2.40 లక్షలను అప్పుగా రేష్మకు బాలకృష్ణ ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన బాలకృష్ణపై ఈ నెల 6న మహిళ యాసిడ్ పోసిందని పాలకోడేరు SI రవివర్మ తెలిపారు. శుక్రవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News November 30, 2024

నరసాపురం హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

image

నరసాపురం పట్టణ పరిధిలోని పలు హోటళ్లను నరసాపురం మున్సిపల్ కమిషనర్‌ ఎం. అంజయ్య తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార ఉత్పత్తుల నాణ్యతతను క్షుణ్ణంగా పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు.

News November 29, 2024

ఏలూరు జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ప్రణాళికల లక్ష్య సాధనపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమ, విద్యా, వైద్యం, రోడ్డు, భవనాలు తదితర శాఖలు లక్ష్యంతో పనిచేయాలన్నారు. మనం చేసే కార్యాచరణతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు.