News February 11, 2026

ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్

image

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని నిరంతరం సేకరిస్తున్నారని వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాలన్నారు.

Similar News

News February 12, 2026

మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News February 12, 2026

మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

image

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్‌లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్‌లో 81.30%, నర్సాపూర్‌లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.