News February 15, 2025
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్‌కు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఫిబ్రవరి 27న జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చునన్నారు. ఆయా ఎన్నికల అధికారులు గమనించాలన్నారు తెలిపారు.
Similar News
News October 19, 2025
విషం తాగిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే?

UP మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.
News October 19, 2025
ప్రమాదం జరిగితే ఇలా చేయండి: ప్రకాశం SP

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీపావళి రోజు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 101కు సమాచారం అందించాలన్నారు. అలాగే పోలీస్ డయల్ 100, 112 నెంబర్లను సైతం సంప్రదించవచ్చని తెలిపారు. కాలుష్య రహిత టపాసులను ప్రజలు కాల్చాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News October 19, 2025
దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.