News February 6, 2025
ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ సత్తా చాటాలి: రేగా కాంతారావు
ఇల్లందు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News February 6, 2025
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!
మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.
News February 6, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫర్నిచర్, విద్యుత్తు ఏర్పాట్లు, నీటి వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్ ఉన్నారు.
News February 6, 2025
ఇవాళ జగన్ ప్రెస్ మీట్
AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.