News December 27, 2025
‘ఎపిడ్యూరల్ అనల్జీసియా’ అంటే?

కర్నూలు జీజీహెచ్ వైద్యులు తొలిసారి ‘ఎపిడ్యూరల్ అనల్జీసియా’ పద్ధతిలో <<18678258>>నొప్పులు లేని ప్రసవాన్ని<<>> విజయవంతం చేశారు. ఈ విధానంలో అనస్థీషియా నిపుణులు వెన్నెముకలోని ఎపిడ్యూరల్ స్పేస్‌లో చిన్న క్యాథెటర్ ద్వారా మందులను పంపుతారు. ఇది నడుము కింది భాగాన్ని మొద్దుబార్చి, తల్లి స్పృహలో ఉంటూనే నొప్పి లేకుండా సుఖ ప్రసవం పొందేలా చేస్తుంది. సాధారణ ప్రసవం పట్ల భయం పోగొట్టే ఈ పద్ధతి ప్రముఖ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది.
Similar News
News December 27, 2025
రామగిరి ఖిల్లాకు టూరిజం కళ

పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారబోతోంది. అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించి పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులతో పరిసర గ్రామాలకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.
News December 27, 2025
భీమవరం: ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన జిల్లా జడ్జి

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శనివారం భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.
News December 27, 2025
చైనా ఆంక్షలు.. వెండి ధరకు రెక్కలు?

2026 నుంచి వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తోంది. ఇకపై సిల్వర్‌ను విదేశాలకు పంపాలంటే లైసెన్స్ తప్పనిసరి. సోలార్ ప్యానెల్స్, EVs, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీలో ఈ లోహం చాలా కీలకం. గ్లోబల్ మార్కెట్లో 60-70% వెండి చైనా నుంచే వస్తోంది. దీంతో గ్రీన్ ఎనర్జీ, టెక్ రంగాల్లో ఇబ్బందులు రావొచ్చని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు మరింత పెరగొచ్చని నిపుణుల అంచనా.


