News February 26, 2026
ఎప్‌స్టీన్ గదిలో షాకింగ్ ఫొటోలు, వస్తువులు

ఎప్‌స్టీన్ పారిస్ ఫ్లాట్‌కు సంబంధించిన షాకింగ్ ఫొటోలు బయటపడ్డాయి. 18 గదుల ఈ లగ్జరీ విల్లాలో గోడలకు వేలాడుతున్న నగ్న చిత్రాలు, సెక్స్ టాయ్స్, వింత జంతువుల డెకరేషన్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 2 కొత్త కేసులు ఫైల్ చేశారు. ఇక్కడే ఎప్‌స్టీన్ స్నేహితుడు జీన్ లూక్ బ్రూనెల్ అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News February 28, 2026
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News February 28, 2026
భారత్‌పై వరుస సెంచరీలు.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మిచెల్

ఈ ఏడాది జనవరి నెలకు గాను న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించింది. భారత్‌తో ODI సిరీస్‌లో మిచెల్ 2 సెంచరీలు, ఒక ఫిఫ్టీతో రాణించారు. మొత్తం 352 రన్స్ చేసి NZ 1-2 తేడాతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తారీ నిలిచారు. ఆమె జనవరిలో ఆడిన 6 మ్యాచుల్లో 229 రన్స్ చేశారు.
News February 28, 2026
కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం <<19263875>>ఘటన<<>> నేపథ్యంలో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయనగరం నుంచి కాకినాడకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వేట్లపాలెం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడనున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఘటనాస్థలానికి బయల్దేరారు.


