News December 20, 2025
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరికొంతమంది ప్రముఖుల పేర్లు

US లైంగిక నేరగాడు <<18618704>>ఎప్‌స్టీన్<<>> కాంటాక్ట్ బుక్‌లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Dr.ఎలీ వీజెల్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్ మాజీ CEO బ్రోన్ఫ్‌మాన్, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, స్పెయిన్ మాజీ ప్రధాని జోస్ అజ్నార్‌తో పాటు పలువురు రాజకీయ, మీడియా రంగ దిగ్గజాలు ఉన్నారు. అయితే పేర్లు ఉన్నంతమాత్రాన వాళ్లు నేరం చేసినట్లు కాదని DOJ స్పష్టం చేసింది.
Similar News
News December 21, 2025
ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.
News December 21, 2025
#SaveAravalli: పురాతన పర్వతాల కోసం నెటిజన్ల పోరాటం!

గుజరాత్, రాజస్థాన్, హరియాణాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ సోషల్ మీడియాలో #SaveAravalli క్యాంపెయిన్ ఊపందుకుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే ‘ఆరావళి’గా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల మైనింగ్, అక్రమ కట్టడాలు, ఎడారి ధూళి వల్ల ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రం కావడం, రాజస్థాన్‌లో వర్షాలు తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయని పర్యావరణవేత్తల ఆందోళన.
News December 21, 2025
అబద్ధాలు ఆపండి.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

స్వతంత్రానికి ముందు అస్సాంను పాక్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని PM మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ అబద్ధాలు ఆపాలని మండిపడింది. ‘అస్సాంను పాక్‌కు ఇచ్చే ప్రపోజలే అప్పట్లో లేదు. కాంగ్రెస్ కుట్ర చేసిందనడానికి ఆధారాలు లేవు. చరిత్రను ప్రచార నినాదంగా PM మార్చుకున్నారు. RSS శిక్షణ పొందిన వ్యక్తి అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు’ అని కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ ఫైరయ్యారు.


