News December 12, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌, క్లింటన్‌, బిల్‌ గేట్స్ ఫొటోలు

image

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ <<18464497>>ఎప్‌స్టీన్ ఎస్టేట్<<>> నుంచి సేకరించిన సంచలన ఫొటోలను హౌస్‌ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసింది. ఇందులో డొనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ క్లింటన్‌, బిల్‌ గేట్స్‌ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ ఫొటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనే విధంగా లేరని కమిటీ స్పష్టం చేసింది. కాగా <<18336928>>ఎప్‌స్టీన్ ఫైళ్ల<<>> విడుదలకు ఇటీవల ట్రంప్ ఓకే చెప్పగా ఇప్పుడు ఆయన ఫొటోలే బయటకు రావడం గమనార్హం.

Similar News

News March 3, 2026

తమ్మినేనిపై సీపీఎం అభిశంసన

image

TG: CPM సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ అభిశంసింది. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంది. ఇది రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలడానికి దారితీసిందని ఆగ్రహించింది. తమ్మినేనితో పాటు కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్‌ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, వారిచ్చిన వివరణల్లోనూ ఆత్మవిమర్శ లోపించిందంటూ అభిశంసన చర్యలు చేపట్టింది.

News March 3, 2026

ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

image

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.

News March 3, 2026

ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

image

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్‌ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్‌గా తీసుకుంది.