News March 16, 2026

ఎప్‌స్టీన్‌‌ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

image

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్‌ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.

Similar News

News March 29, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

image

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.

News March 29, 2026

కాంగ్రెస్ పాలనలో స్కాములపై విచారణ జరిపించండి: BRS

image

TG: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని BRS ఆరోపించింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని CM రేవంత్‌కు BRSLP లేఖ రాసింది. 20 స్కాముల పేర్లను లేఖలో పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని CM రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

News March 29, 2026

NBK111.. పవర్‌ఫుల్ రోల్‌లో లక్ష్మీరాయ్?

image

గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో లక్ష్మీరాయ్ నటించనున్నట్లు సమాచారం. ఇదొక పవర్‌ఫుల్ రోల్ అని, ఆమె ఎంట్రీతోనే కథ మలుపు తిరుగుతుందని టాక్. బాలయ్య-లక్ష్మీ కాంబినేషన్‌లో ‘అధినాయకుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కాగా NBK111 చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి హీరోతో గోపీచంద్ రూపొందించే చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.