News September 2, 2025

ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు యూరియా అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎమ్మార్పీ ధర కన్నా యూరియా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత రాకూడదని ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు అగ్రికల్చరల్ కోపరేటివ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 3, 2025

స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కట్టుబడి ఉండాలి: కలెక్టర్

image

స్వచ్ఛ శ్రీకాకుళం సాధనతో సహా, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛతను ప్రజల దైనందిన జీవన విధానంలో భాగం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతీ మూడో శనివారం స్వచ్ఛదివాస్ కార్యక్రమాన్ని చేయాలన్నారు.

News September 2, 2025

రైతుల కోసం మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న

image

రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యం నుంచి మీడియాతో రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులు, ఉల్లి ధ‌ర‌ల‌పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమన్నారు. రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మంత్రి అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డారన్నారు.

News September 2, 2025

స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో టాప్‌లో నిలవాలి: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాకు అధిక సంఖ్యలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు వచ్చేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం వీసి ద్వారా సమీక్ష చేశారు. అవార్డులు గెలుచుకున్న వారికి రూ.లక్ష రివార్డు, జిల్లా స్థాయి అవార్డులకు రూ.25 వేల వరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో అవార్డులను సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.