News February 27, 2025

ఎమ్మిగనూరులో చోరీ

image

ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్‌కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.

Similar News

News January 23, 2026

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

image

T20 WCకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్‌ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.

News January 23, 2026

MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ

image

ఓటు ప్రాధాన్యత గురించి ప్రతిఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సం.లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో “జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని” పురస్కరించుకొని కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
       

News January 23, 2026

KNR: మొక్కుల ‘బంగారం’.. షాపుల వద్ద సందడి!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మేడారం జాతర సందడి నెలకొంది. సమ్మక్క-సారలమ్మ తల్లులకు ‘నిలువెత్తు బంగారం'(బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని కిరాణా దుకాణాలు బెల్లం ముద్దలతో కళకళలాడుతున్నాయి. వ్యాపారులు భారీగా బెల్లం నిల్వలను అందుబాటులో ఉంచారు. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో తల్లుల నామస్మరణ మారుమోగుతోంది. జాతర నేపథ్యంలో వ్యాపారాలు జోరందుకున్నాయి.