News June 19, 2024

ఎమ్మిగనూరు: ఆటో బోల్తాపడి.. బాలిక మృతి

image

ఆటో బోల్తాపడి బాలిక మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు..గోనెగండ్లకు చెందిన రహంతుల్లా కుటుంబంతో కలిసి తన సోదరి భానును చూసేందుకని ఎమ్మిగనూరు వచ్చారు. ఈ క్రమంలో రహంతుల్లా పెద్ద కూతురు ఆల్పీషా(12)ను తీసుకుని భాను మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ వద్ద ఆవులు అడ్డంగా వచ్చాయి.తప్పించబోయి ఆటో బోల్తా పడటంతో ఆల్పీషా మృతిచెందింది.

Similar News

News October 4, 2024

కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల

image

రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్‌లో 153 మంది, మూడో సెమిస్టర్‌‌లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్‌లో 32 మంది, మూడో సెమిస్టర్‌లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్‌లో 38 మంది, మూడో సెమిస్టర్‌లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.

News October 4, 2024

క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా ఓటరు జాబితా సర్వే: కమిషనర్

image

ఓటరు జాబితా సవరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నగరపాలక నూతన కౌన్సిల్ హాలులో బిఎల్‌ఓ‌లతో సమావేశం నిర్వహించారు. ఫాం 6, 7, 8ల పూరింపులపై అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటుకు ధరకాస్తు, చనిపోయినవారి ఓటు తొలగింపు, సవరణలు తప్పొప్పులు లేకుండా ప్రక్రియ చేయాలన్నారు.

News October 3, 2024

గ్రామపంచాయతీలో రైతుబజార్ల ఏర్పాటు: కలెక్టర్

image

RIDF, నాబార్డ్ గ్రాంట్ కింద గ్రామపంచాయతీలో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో RIDF, నాబార్డ్ గ్రాంట్ బేస్డ్ ప్రాజెక్టుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ గ్రాంట్ కింద జీవనోపాదుల కల్పనకు విరివిగా అవకాశాలున్నాయని, సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.