News April 16, 2025

ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

image

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.

Similar News

News April 16, 2025

నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్.. నిందితుడి అరెస్ట్

image

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్‌ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.

News April 16, 2025

కర్నూలు టీడీపీ కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు

image

కర్నూలులోని డీమార్ట్ వెనక ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నలుగురిని నాల్గో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ నాయుడు, కాశీ, రహంతుల్లా, సలాంఖాన్ దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లు, కత్తులతో కార్యాలయంలోని శేఖర్ గౌడ్‌పై దాడికి యత్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 16, 2025

అనుచిత వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్

image

గూడూరులో పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌ అనే యువకులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై గుంటూరులో సైబర్ క్రైం కేసు నమోదైంది. వారి ఆదేశాల మేరకు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!