News December 31, 2025

ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు: ఎంపీ భరత్

image

AP: వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఖండించారు. ఓ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఉంటూ ఎమ్మెల్యే పదవికి తాను జస్టిస్ చేయలేనన్నారు. ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ భరత్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీ స్థానానికి బరిలో నిలిచేందుకు సిద్ధమని MLA గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Similar News

News January 6, 2026

ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

image

AP: రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇప్పటికే కొనసాగుతున్న 62ఏళ్లు పైబడిన 2,831మంది ఉద్యోగులపై దృష్టి సారించారు. వయోపరిమితి పెంపుతో పడే అదనపు భారాలపై వివరాలు సేకరించి మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

News January 6, 2026

RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<>RCFL<<>>)లో 10 సీనియర్ ఇంజినీర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/ బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ Engg.,పెట్రోకెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://www.rcfltd.com

News January 6, 2026

మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

image

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.