News January 14, 2026

ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు డిప్యూటీ సీఎం లేఖ

image

రాష్ట్రంలో విద్యుత్ పరంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఈ మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పంపిన లేఖను స్థానిక విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం అందజేశారు. విద్యుత్ శాఖ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, త్వరలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 4, 2026

MLG: హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, వంటశాల, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

News February 4, 2026

చింతలపూడిలో ఈ నెల 12,13న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

image

దుగ్గిరాల మండలం చింతలపూడిలోని ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ నెల 12, 13న రెండ్రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో పోటీలను వేర్వేరుగా నిర్వహిస్తామని వెల్లడించారు.

News February 4, 2026

VKB: పుర పీఠానికి స్పీకర్ కుమార్తెకు లైన్ క్లియర్

image

బీఆర్ఎస్ నుంచి 17 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి ఆనంద్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. స్పీకర్ తనయ గడ్డం అనన్య ఆ వార్డ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌తో సోమవారం మాజీ ఎంపీటీసీ రవి సర్పంచ్ రాజు సంప్రదింపులు జరిపి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఛైర్‌పర్సన్ పీఠానికి లైన్ క్లియర్ అయింది.