News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ.. త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
Similar News
News November 6, 2025
గుంటూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 7న గుంటూరులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి హెలిపాడ్, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ప్రణాళికపై అధికారులకు సూచనలు చేసి సమన్వయంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 5, 2025
గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
News November 5, 2025
GNT: ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా సీసీఐకి విక్రయించాలి

పత్తి రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే పత్తి విక్రయం చేయవచ్చని CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. 2025-26 పంట సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని అమ్మాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐఓఎస్‌లో ఉన్న ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకుని నాణ్యమైన, బాగా ఆరబెట్టిన పత్తిని CCI కేంద్రాలకు తీసుకురావాలన్నారు.


