News October 24, 2025
ఎమ్మెల్యే సంజయ్ ఈరోజు ఏం చెబుతారో మరి..?

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేడు స్పీకర్ సమక్షంలో మరో మారు విచారణను ఎదుర్కోనున్నారు. పిటీషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తరపు న్యాయవాదులు సంజయ్ పై అనర్హత వేటు వేయాలని మౌఖిక వాదనలు వినిపించనున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదని, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని, కాంగ్రెస్లో చేరాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్రితం విచారణలో సంజయ్ స్పష్టం చేశారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 24, 2025
పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

★ మీరు ఎవరికో సేవ చేస్తున్నానని భావిస్తే మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. నా వారికి నేను చేస్తున్నానని భావించాలి
★ భగవంతుడు లేని ప్రదేశం లేదు. ఇది భగవంతుడు కాదు అని చెప్పడానికి అవకాశమే లేదు
★ రెండు బాధల మధ్య గల విరామమే సుఖం
★ మానవత్వం చాలా ప్రవిత్రమైనది. ఇలాంటి పవిత్రమైన, ప్రియమైన, విలువైన మానవత్వాన్ని వ్యర్థం చేసుకోకూడదు!
News October 24, 2025
APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 పోస్టులు

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/


