News August 30, 2024
ఎమ్మెల్యే RRR కేసులో దర్యాప్తు షురూ..!

ఉండి MLA రఘురామకృష్ణరాజు కేసుపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిందితులుగా పేర్కొన్న మాజీ CM జగన్, CID పూర్వపు GD సునీల్‌కుమార్, అప్పటి నిఘా బాస్ ఆంజనేయులు తదితరులకు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని, ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని బాధ్యులుగా చేయాలని RRR పోలీసులను కోరారు.
Similar News
News November 8, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025
ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్‌ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
News November 8, 2025
పాలకొల్లు: నీళ్లనుకుని కలుపుమందు తాగి వ్యక్తి మృతి

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పాలూరి రమేశ్ (46) మృతి చెందాడు. ఈ నెల 4న విధులకు వెళ్తూ పొరపాటున మంచినీళ్ల సీసాకు బదులు కలుపుమందు సీసాను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నీళ్లు అనుకుని దానిని తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.


