News March 10, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

image

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.

Similar News

News March 6, 2026

BiPC స్టూడెంట్స్‌‌కు ఏయే కోర్సులున్నాయంటే?

image

<<19303162>>ఇంటర్‌లో<<>> BiPC చేసిన వారికి మెడిసిన్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశపరీక్షల ద్వారా MBBS, ఆయుర్వేద, హోమియో, వెటర్నరీల్లో చేరొచ్చు. డిగ్రీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ కోర్సులకు డిమాండ్ ఉంది. నర్సింగ్, ఫిజియోథెరపీలాంటి పారామెడికల్ కోర్సులు.. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీలో BSc చేయొచ్చు. రేపు 2PMకు MEC..

News March 6, 2026

ప్రకటన సరే.. అమలు సాధ్యమేనా?

image

16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించే ఆలోచన బాగున్నా అమలులో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏజ్ వెరిఫికేషన్ చేయడం కష్టమేనని, VPN వాడి లొకేషన్ మార్చి యాక్సెస్ చేయొచ్చని అంటున్నారు. ‘తప్పుడు వివరాలతో అకౌంట్లు తెరవడాన్ని ఆపడం కష్టమే. అయితే ప్రభుత్వం టెక్ సంస్థలపై కఠిన నిబంధనలు విధిస్తూ, తల్లిదండ్రులు ఇంట్లో పర్యవేక్షణ పెంచితే ఇది సాధ్యమవుతుంది’ అని అభిప్రాయపడుతున్నారు.

News March 6, 2026

JGL: నాన్న అని పిలవలేని బాల్యం.. గణపతి కుమారుడి భావోద్వేగ గాధ

image

ఒక విప్లవం వెనుక సిద్ధాంతాలు, ఒక ఉద్యమం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉంటాయి. కానీ ఉద్యమాల నీడలో కుటుంబం, తండ్రి, తల్లి, పిల్లల మధ్య బంధం నిశ్శబ్దంగా బలి అవుతాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావుA/Sగణపతి కొడుకు శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక భావోద్వేగపూరిత సందేశం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నాన్న అని పిలవలేని బాల్యం నుంచి ఒక్కసారి చూడాలనే ఆత్రుత వరకు ఉన్న అనుబంధాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.