News August 9, 2024
ఎమ్మెల్సీ ఎంపిక విషయమై చంద్రబాబుతో విశాఖ నేతల చర్చ

చంద్రబాబు నివాసానికి విశాఖ టీడీపీ నేతలు శుక్రవారం చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారుపై వారు చంద్రబాబుతో చర్చిస్తున్నారు. వైసీపీ ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో తమ అభ్యర్థి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఏక అభిప్రాయం కుదిరితే ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలపై కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
Similar News
News February 13, 2026
GNT: టిప్పర్ ఢీకొని స్పాట్ డెడ్.. అవయవాలు నుజ్జునుజ్జు!

గుంటూరు అమరావతి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెకానిక్ షాప్‌లో పనిచేసే యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ లారీ అతణ్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ టైర్లు ఎక్కడంతో ఆ యువకుడి శరీరం నుజ్జునుజ్జై ఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 13, 2026
GNT: రాజధాని రైతులకు ముఖ్య గమనిక

రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” శనివారం అనగా ఫిబ్రవరి 14న రద్దు చేస్తున్నట్లు CRDA అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ కారణాల రీత్యా రేపు గ్రీవెన్స్ డే జరగదని, రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News February 13, 2026
GNT: అధ్యాపకుల గైర్హాజరు.. నోటీసులకు కలెక్టర్ ఆదేశాలు

చేబ్రోలు డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రత అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హారైన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.


