News February 5, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు.
Similar News
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.
News February 5, 2025
కడెం: ‘పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి’
మండలంలోని ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి చైతన్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎంపీవో కవిరాజుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.