News February 26, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు టోల్ ఫ్రీ నెంబర్లు: కలెక్టర్

image

తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్ల సౌలభ్యం నిమిత్తం హెల్ప్ లైన్ నంబర్లను ఏలూరు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 1950, 949-104-1419, టోల్ ఫ్రీ నంబర్ 18002331077 లను ఎన్నికల ఓటర్లు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News September 19, 2025

గద్వాలలో కాంగ్రెస్‌కు భారీ షాక్..?

image

జిల్లాలో కాంగ్రెస్‌కి భారీ షాక్ తగలనుందని స్థానికులు అనుకుంటున్నారు. కేటీదొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు BRSలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. BRS గద్వాల ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో వీరంతా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

News September 19, 2025

మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

image

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.

News September 19, 2025

HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్‌లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.