News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

Similar News

News December 25, 2025

మెదక్ చర్చిలో బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

image

ప్రసిద్ధ మెదక్ చర్చి వద్ద క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు పరిశీలించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు చర్చ్‌కు తరలివస్తున్నందున శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా భక్తులు చర్చి సందర్శించి వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News December 25, 2025

వర్గపోరుపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

image

సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపుల గోలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్గపోరు కాంగ్రెస్‌కు నష్టం, బీఆర్ఎస్‌కు లాభమని హెచ్చరించారు. హరీష్ రావు పదేళ్ల మంత్రిగా ఉండి నిధులన్నీ సిద్దిపేటకు ఇచ్చారని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ చెప్పారు.

News December 24, 2025

MDK: క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి: కలెక్టర్

image

యేసుక్రీస్తు జన్మదినోత్సవమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, క్షమ, త్యాగం, శాంతియుత సహజీవనం వంటి విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ఈ సందేశాన్ని ఆచరణలో పెట్టాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.