News February 26, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేద్దాం: వరంగల్ సీపీ

ఎన్నికల నిబంధనలను అమలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. ఎన్నికల సందర్బంగా సీపీ అధికారులతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నిఘా పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు.
Similar News
News December 22, 2025
NLG: పాత బాకీలు కోట్లలోనే.. ముందుకు సాగేది ఎట్లా?

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జీపీలకు సుమారు రూ.140 కోట్లపైనే అప్పు ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త సర్పంచ్లకు అభివృద్ధి అనేది సవాల్‌గా మారనుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంటు బిల్లులు, తరచుగా వచ్చే మోటార్ల మరమ్మతులు, ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు నూతన పాలక వర్గాలకు ఆర్థికంగా పెనుభారంగా పరిణమించబోతోంది.
News December 22, 2025
లేటెస్ట్ అప్డేట్స్ @9AM

* నేడు ఢిల్లీ హైకోర్టులో పవన్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ.. అనుమతి లేకుండా తమ పేర్లు, ఫొటోలు వాడొద్దని పిటిషన్లు
* ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి ట్రైనింగ్..
* పోలవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ నేడు మన్యం బంద్
* AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులైన అన్నాదమ్ముల దారుణ హత్య. నిందితులను పట్టుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.


