News February 13, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులకు కలెక్టర్ సూచనలు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పివో, ఏపివో లకు మొదటి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
Similar News
News December 16, 2025
సర్పంచ్, వార్డు సభ్యులకు 20న ప్రమాణ స్వీకారం: జనగామ కలెక్టర్

జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఈ నెల 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 16, 2025
ఇంటర్నెట్ కింగ్ ‘Chrome’.. మార్కెట్‌లో 70% వాటా!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతోంది. ‘STAT COUNTER’ విడుదల చేసిన NOV-2025 డేటా ప్రకారం.. 70% కంటే ఎక్కువ మంది యూజర్లు క్రోమ్‌నే వాడుతున్నారు. దీని తర్వాత సఫారీ(14.35%), EDGE(4.98%), ఫైర్‌ఫాక్స్(2.3%), ఒపెరా(1.89%), శామ్‌సంగ్ ఇంటర్నెట్(1.86%), మిగిలినవి(3.4%) ఉన్నాయి. మీరు ఏ బ్రౌజర్ ఎక్కువగా వాడతారు? COMMENT
News December 16, 2025
చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.


