News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై విశాఖ కలెక్టర్ కసరత్తు 

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విధులు నిర్వ‌హించే సిబ్బందికి రెండో విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం పూర్త‌య్యింది. విశాఖ జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాల‌కు గాను పీవో, ఏపీవో, ఓపీవోల‌ను కేటాయిస్తూ క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌లెక్ట‌రేట్లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఆన్‌లైన్ ప్ర‌క్రియ ద్వారా 13 పీవోల‌ను, 13 ఏపీవోల‌ను, 26 మంది ఓపీవోలను కేటాయించారు.

Similar News

News February 24, 2025

వాల్తేరు డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర బాధ్యతల స్వీకరణ

image

వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్‌ఎంగా లలిత్‌ బోహ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఆర్‌ఎంగా పని చేసిన సౌరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటి వరకు మనోజ్‌కుమార్‌ సాహు తాత్కాలిక డీఆర్ఎంగా వ్యవహారించారు.

News February 24, 2025

విశాఖ: 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..❤

image

విశాఖ జిల్లా ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. 1998-99లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. చదువులు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు. మీరూ ఇలా చేశారా? చివరిసారి ఎప్పుడు గెట్ టూ గెదర్ చేసుకున్నారో కామెంట్ చేయండి.

News February 24, 2025

విశాఖ: నాని అరెస్ట్.. కారణం ఇదే..?

image

విశాఖకు లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన ఓ యువకుడు కొన్ని బెట్టింగ్ యాప్‌ల్లో నగదు పెట్టి నష్టపోయాడు. దాదాపు రూ.2కోట్ల వరకు అప్పులు చేశాడు. ఇదే సమయంలో అతనికి నాని చేసిన ప్రమోషన్ వీడియోలు కనపడ్డాయి. తనలా మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో సదరు యువకుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోనే నానిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!