News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
Similar News
News February 24, 2025
దుద్యాల: నేటితో ముగియనున్న ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

దుద్యాల మండలం పోలేపల్లిలో వెలసిన భక్తుల ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఆదివారం ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ వారు సోమవారం రాత్రి అమ్మవారి ఆలయాన్ని ఊరేగింపు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
News February 24, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య

TGలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఆరు జిల్లాల్లోని 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏఐ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల్లో లోపాలను గుర్తించనున్నారు. దీంతో వారికి టీచర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
News February 24, 2025
HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.