News May 19, 2024
ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు మద్దతు:తమ్మినేని

KMM-NLG-WGL పట్టభద్రుల MLC స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడూ BJPని ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మల్లన్నను గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
Similar News
News January 30, 2026
ఖమ్మం: బాక్సింగ్‌లో ‘రూప’ మెరుపు

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.
News January 30, 2026
ఖమ్మం: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.
News January 30, 2026
ప్రతి బిడ్డ చదువుకోవాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.


