News February 10, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3వేల మెజార్టీ రావాలి: జగ్గారెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంగారెడ్డి నుంచి 3000 ఓట్ల మెజార్టీ రావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ధర్మ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో TGIIC చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, నాయకులు తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Similar News
News January 25, 2026
సింగరేణి అక్రమాలపై ‘సీబీఐ’ విచారణ జరపాలి: పొంగులేటి సుధాకర్ రెడ్డి

సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్లు, పనుల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిపై సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన ప్రతి కార్యక్రమంపై లోతైన దర్యాప్తు జరగాలని కోరారు. ఈ వ్యవహారాన్ని త్వరలోనే మోదీ, అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
News January 25, 2026
గుంటూరులో రిపబ్లిక్ డే వేడుకలు రేపు 11:30కి ప్రారంభం: కలెక్టర్

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రేపు 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నందున జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 25, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాప్ ఓనర్ అరెస్ట్

నాంపల్లిలోని అబిడ్స్ ప్రాంతంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ 110 సెక్షన్ కింద దుకాణ నిర్వాహకుడు సతీశ్ బచా(54)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించనున్నారు.


