News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం: MHBD కలెక్టర్

గురువారం జరగబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాద్ జిల్లాలోని ఫాతిమా హైస్కూల్ నుంచి జిల్లాలోని 16 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు కృష్ణవేణి గణేశ్ పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
KNR: ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి.. అయినా ఈ పరిస్థితి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు(M) పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి,సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి ఉన్న జిల్లాలో ఈపరిస్థితి ఏంటని అంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News November 6, 2025
రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)
News November 6, 2025
HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.


