News February 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
NLG: జిల్లాకు నాలుగు ట్రామా కేర్ సెంటర్లు

జిల్లాలో కొత్తగా 4 ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన, తక్షణ చికిత్స అందడంతో ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని DVK, MLG, నాగార్జునసాగర్, NKL ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో DVK, MLG ఏరియా ఆసుపత్రుల్లో పనులు ప్రారంభించనున్నారు.
News December 22, 2025
కేయూలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన బీటెక్ 3వ, 5వ, 7వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈనెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలను పరిపాలనా కారణాలతో వాయిదా వేసి, డిసెంబర్ 29 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి టైం టేబుల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
News December 22, 2025
ACC ఛైర్మన్ నఖ్వీకి ఘోర అవమానం

ACC ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి మరోసారి ఘోర అవమానం జరిగింది. దుబాయ్‌లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మెడల్స్ అందించేటప్పుడు నఖ్వీ చేతుల నుంచి వాటిని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో రన్నరప్ మెడల్స్‌ను ICC అసోసియేట్ డైరెక్టర్ ముబాసిర్ ఉస్మానీ అందించారు. నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్ <<18073064>>తీసుకోకపోవడం <<>>ఇది రెండోసారి.


