News February 13, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News July 7, 2025

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50 వేల ఉద్యోగాలు!

image

2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.

News July 7, 2025

భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: మోదీ

image

రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించే గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలి. కంటెంట్ మూలం తెలిస్తే.. పారదర్శకత ఉండి, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

News July 7, 2025

కానిస్టేబుల్‌పై దాడి.. యోగి మార్క్ ట్రీట్మెంట్

image

UP: ఫిలిభిట్‌ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్‌‌పై దాడి చేసిన కేసులో తండ్రి, ముగ్గురు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహావీర్ ఫిర్యాదు ప్రకారం.. ఢాకా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి మహావీర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఓ గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు దాడి చేసి, యూనిఫామ్ చింపేశారు. వారికి పోలీసులు వారి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులే దౌర్జన్యం చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.