News March 13, 2025
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 14, 2025
నల్గొండ: శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 14, 2025
నల్గొండ: ఇంటర్ పరీక్షలు.. 601మంది డుమ్మా..!

నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయని డీఐఈఓ దస్రు నాయక్ తెలిపారు. గురువారం జరిగిన ప్రథమ సంవత్సరం గణితం బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ పరీక్షలకు 13వేల 772 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 13వేల 171 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 601 విద్యార్థులు పరీక్షకు గైరాజరయ్యారని తెలిపారు.
News March 14, 2025
నల్గొండ: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

నల్గొండలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI