News November 22, 2024
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రశ్న.. గందరగోళంగా మారిన సభ

వైసీపీ హయాంలో అమలు చేసిన ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఇప్పుడేమైనా ఇస్తారా? అని YCP ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాసనమండలిలలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి సవిత మాట్లాడుతూ.. ‘మేము అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. వైసీపీ వారిని పట్టించుకోలేదు. బటన్ నొక్కడమే తప్ప ఉపాధి కల్పించలేదు. దీంతో గంజాయికి అలవాటు పడ్డారు’ అని అనడంతో YCP నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
Similar News
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 7, 2025
వందేమాతరం గొప్ప గేయం: కడప SP

వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే గొప్ప గేయం వందేమాతరం అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


