News January 8, 2026

ఎమ్మెల్సీ సారయ్య 2.0

image

వరంగల్ జిల్లాలో MLC బస్వరాజు సారయ్య మాటే శాసనంలా మారింది. ఎప్పుడో జరిగిన కేసుల్లో అక్రమార్కులను సస్పెన్షన్లు చేయిస్తూ, పోలీసులకు దడ పుట్టిస్తున్నారు. మరో పక్క మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సారయ్య పవర్ సెంటర్‌గా మారారు. పనుల కోసం మంత్రి దగ్గరి కంటే ఎమ్మెల్సీ దగ్గరికే ఎక్కువగా వస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న మంత్రి పొంగులేటి రివ్యూలో సైతం అధికారులపై రుసరుసలాడటం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News January 9, 2026

మడకశిరలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. 3 రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మడకశిరలో 9.3 డిగ్రీలు నమోదయ్యాయి. సోమందేపల్లిలో 10.2 డిగ్రీలు, తనకల్లు 10.3, రొద్దం 10.5, గుడిబండ, అమడగూరు 11.1, ఓడీ చెరువు 11.2, అమరాపురం 11.4, రాప్తాడు 11.5, పెనుకొండ 11.6, గోరంట్ల 11.7, చిలమత్తూరు, ఉరవకొండ 11.8 డిగ్రీలు నమోదయ్యాయి. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.

News January 9, 2026

అనంత జిల్లా ప్రజలకు అదిరిపోయే న్యూస్

image

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకైనా సాధారణ ఛార్జీలే ఉంటాయని పేర్కొంది. పండుగకు ముందు 39, తర్వాత 38 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

News January 9, 2026

HNK: టెన్త్ విద్యార్థులకు అల్పాహార నిధులు విడుదల!

image

పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర సమగ్రశిక్ష విభాగం అల్పాహార నిధులు మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున, ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (19 రోజులకు) ఈ అల్పాహార ఖర్చులు మంజూరు చేశారు. దీంతో వరంగల్‌లో 2,768 మందికి రూ.7.88 లక్షలు,
​హనుమకొండలో 2,491 మందికి రూ.7.09 లక్షల నిధులు మంజూరయ్యాయి.