News December 1, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/

Similar News

News April 10, 2026

ఆ బాధతో రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని: ఆమిర్

image

తనను ఒంటరిగా వదిలి మొదటి భార్య రీనా దత్తా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోయానని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఎమోషన్లను అదుపు చేసుకోలేక ఏడాదికిపైగా రోజూ ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు తనకు లిక్కర్ అలవాటు లేదన్నారు. రీనాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో ఆమిర్ డివోర్స్ తీసుకొన్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్‌లో ఉన్నారు.

News April 10, 2026

కన్నింగ్ పాక్ మధ్యవర్తిత్వం.. పరిష్కారం లభించేనా?

image

పాక్ వేదికగా US-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హార్ముజ్‌పై నియంత్రణ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు పక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పాల్గొంటారు. అయితే నిలకడ లేని అమెరికా, టెంపరమెంట్‌తో ఊగిపోయే ఇరాన్ మధ్య కన్నింగ్ పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం ఫలితాన్నిస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా? అనేది కాలమే నిర్ణయించనుంది.

News April 10, 2026

IPLలో సంచలనం.. ఎవరీ ముకుల్ చౌదరి

image

KKRపై LSGకి సూపర్ <<19611855>>విక్టరీ<<>> అందించిన ముకుల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్‌లోని ఝున్‌ఝును. ఆయన తండ్రి దలీప్ ఒక టీచర్. తాను క్రికెటర్‌‌ అవ్వాలన్నది తన తండ్రి కల అని, తాను పుట్టకముందే ఆయన డిసైడ్ అయ్యారని ముకుల్ చెప్పారు. మొదట్లో ముకుల్ ఫాస్ట్ బౌలింగ్ వేసేవారు. తర్వాత వికెట్ కీపర్‌గా మారారు. SMATలో 198.86SRతో 5 ఇన్నింగ్స్‌లలో 173 రన్స్ చేశారు. ముకుల్‌ను LSG వేలంలో ₹2.6Crకు దక్కించుకుంది.