News March 1, 2026
ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారత ప్లేయర్స్

ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు గల్ఫ్ దేశాల ఎయిర్ పోర్టుల్లో భారత ఆటగాళ్లు చిక్కుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఓలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చిక్కుకోగా.. ఖతర్‌లోని దోహా ఎయిర్‌పోర్టులో భారత బాస్కెట్‌బాల్ జట్టు ఇరుక్కుపోయింది. సింధు ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడేందుకు బర్మింగ్‌హామ్ వెళ్లాల్సి ఉండగా.. ఖతర్‌తో 2027 WC కోసం FEB 27న క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడిన భారత బాస్కెట్‌బాల్ జట్టు భారత్ తిరిగిరావాల్సి ఉంది.
Similar News
News March 1, 2026
IND vs WI.. గెలిస్తే సెమీస్ ఆ జట్టుతోనే!

T20WC: నేడు ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు సెమీస్‌కు క్వాలిఫై అయ్యి ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్చి 5న సెమీస్ జరగనుంది. మరోవైపు సౌతాఫ్రికా ఇవాళ జింబాబ్వేతో ఆడనుంది. ఇప్పటికే క్వాలిఫై అయిన సౌతాఫ్రికా మార్చి 4న ఈడెన్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ తలపడే అవకాశం ఉంది. కాగా ఫైనల్ అహ్మదాబాద్‌లో MAR 8న జరుగుతుంది.
News March 1, 2026
ఖమేనీని ఎలా చంపారంటే..

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ చేపట్టిన తొలి విడత దాడుల్లోనే ఖమేనీ చనిపోయారు. ఖమేనీ కదలికలను కనిపెడుతూ పక్కా ప్లాన్‌తో పని చేశాయి. IRGC కమాండర్ మహమ్మద్ పక్‌పౌర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ సెక్రటరీ అలీ షంకానీతో ఖమేనీ భేటీ అయిన టైమ్ చూసి అటాక్ చేశాయి. కేవలం శాటిలైట్ నిఘా కాకుండా ఎవరో ఖమేనీ వెంటే ఉంటూ సమాచారం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. సేఫ్ ప్లేస్ అని ఖమేనీ భావించిన చోటే దెబ్బకొట్టాయి.
News March 1, 2026
మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కటోల్ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. SBL ఎనర్జీ లిమిటెడ్‌లో జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


