News December 9, 2025
ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.
Similar News
News April 8, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.
News April 8, 2026
ఈ యుద్ధంలో నిజంగా ఓడింది సామాన్యుడే!

సీజ్‌ఫైర్‌ను US, ఇరాన్ రెండూ తమ విజయంగా చెప్పుకొన్నాయి. లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకున్నాయి. కానీ 38 రోజుల ఈ యుద్ధంలో నిజంగా ఓడింది మాత్రం సామాన్యుడే. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. చాలా దేశాలు ఎకనామిక్ క్రైసిస్‌లో చిక్కుకున్నాయి. పరువు కోసం ఇరాన్, US గెలుపు పాటలు పాడుతున్నా.. ప్రపంచం మాత్రం ఆ భారాన్ని ఇంకా మోయాల్సిందే.
News April 8, 2026
సీజ్‌ఫైర్: రాకెట్‌లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ ఏకంగా 766 పాయింట్లు లాభపడి 23,890 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 2,587 పాయింట్లు ఎగసి 77,204 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వరుసగా 4వ సెషన్‌లోనూ రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో పోలిస్తే 0.4 శాతం ఎగసి 92.61కి చేరింది.


