News February 11, 2026
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అక్కడేనా?

అనంతపురం జిల్లాలో కార్గో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సుమారు 1,200 ఎకరాల భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం కుడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద భూములను ఆర్డీవో కేశవ నాయుడు పరిశీలించారు. అనంతపురం సరిహద్దులోని కుడేరు మండలం, రాప్తాడు నియోజకవర్గంలోని కొంత భాగంలో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానున్నట్లు సమాచారం.
Photo: AI
Similar News
News March 11, 2026
ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.
News March 11, 2026
OTTలోకి 4 కొత్త సినిమాలు

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.


