News January 15, 2026

ఎయిర్‌ఫోర్స్ స్కూల్ హిండెన్‌లో ఉద్యోగాలు

image

ఘజియాబాద్‌లోని <>ఎయిర్‌ఫోర్స్ <<>>స్కూల్ హిండెన్‌ 30 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 24 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, B.PEd, M.PEd, BEd, B ELEd, D.Ed, డిప్లొమా, CTET, STET ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: airforceschoolhindan.co

Similar News

News January 30, 2026

భారీగా పెరుగుతున్న గిగ్ కార్మికులు

image

దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరి సంఖ్య 2021లో 77 లక్షలు కాగా 2025కి 1.2 కోట్లకు చేరిందని సోషియో ఎకనమిక్ సర్వే-2026 పేర్కొంది. దేశ శ్రామికశక్తిలో ఇది 2%గా ఉంది. 2030 నాటికి 6.7%కి చేరుకుంటుందని అంచనా వేసింది. 52L మంది ఈ కామర్స్, లాజిస్టిక్స్ రంగాలలో పనిచేస్తున్నారు. వీరిలో 40% మంది వేతనం ₹15000 కన్నా తక్కువే. పనిగంటలూ అధికమే. గిగ్ వర్కర్ల పెరుగుదలతో UPI పేమెంట్లూ పెరుగుతున్నాయి.

News January 30, 2026

అయ్యప్ప గోల్డ్ చోరీ: నటుడిని విచారించిన SIT

image

శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్‌ను SIT సాక్షిగా విచారించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రిలేషన్, తన ఇంట్లో పూజలపై ప్రధానంగా ప్రశ్నించారు. తరచూ శబరికి వెళ్లే తనకు అక్కడి ఉద్యోగి పొట్టి పరిచయం ఉందని జయరామ్‌ గతంలో తెలిపారు. దేవాలయం మూసి ఉండే రోజుల్లో ఆభరణాలు ఇంట్లో ఉంచి పూజిస్తే మంచిదని తనతో చెప్పాడన్నారు. గతంలో జయరామ్ ఇంట్లో ఆభరణాలతో పూజలు చేసిన ఫొటోలు కలకలం సృష్టించాయి.

News January 30, 2026

జగన్‌ను కలిసిన చెవిరెడ్డి

image

AP: అక్రమ మద్యం కేసులో అరెస్టై నిన్న బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YCP అధినేత జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి వెళ్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వివరించినట్లు YCP ట్వీట్ చేసింది. కాగా ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చినట్లు పేర్కొంది.