News January 9, 2026

ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయ్!

image

AP: రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులోని మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ట్యాక్సీలు అన్ని భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే రెండేళ్లలో సేవలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News February 9, 2026

చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

image

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.

News February 9, 2026

364 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News February 9, 2026

రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.