News November 5, 2025

ఎరవల్లి: 108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

image

పురిటి నొప్పులతో 108 వాహనంలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఎర్రవల్లి మండలం యాక్తాపురంలో చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండలం యాక్తాపురంలో గ్రామానికి చెందిన ఆసియాకు పురిటి నొప్పులు అధికం కావడంతో బంధువులు 108 ఫోన్ చేశారు. సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకోని గర్భిణీని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికం కావడంతో 108లోనే సురక్షితంగా డెలివరీ చేశారు.

Similar News

News March 9, 2026

వికారాబాద్ కలెక్టరేట్‌లో కుక్కల బెడద!

image

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కుక్కల స్వైర విహారం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది. కొంతకాలంగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ విధులకు వచ్చే ఉద్యోగులపై దాడులకు తెగబడుతుండటంతో భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ లోపలికి కూడా కుక్కలు ప్రవేశిస్తుండటంతో ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నామని, కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

News March 9, 2026

కుటుంబ కలహాలపై 20 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో 58 పిటిషన్లు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలపై 20, ఇతర విభాగాలకు చెందిన 25 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు.

News March 9, 2026

కిమ్ వంతేనా? ట్రంప్ ‘డికాపిటేషన్’ స్కెచ్!(1/2)

image

అమెరికా అనుసరిస్తున్న ‘డికాపిటేషన్ స్ట్రైక్’ వ్యూహం ఇప్పుడు ప్రపంచ నియంతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మదురో బందీ కావడం, ఖమేనీ మృతిచెందడంతో.. తదుపరి లక్ష్యం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కానున్నారా? అనే చర్చ మొదలైంది. అమెరికా పాత సిద్ధాంతం ‘లీడర్‌షిప్ టార్గెటింగ్’ను ట్రంప్ ఆచరణలోకి తేవడంతో ప్యాంగ్‌యాంగ్‌లో భయం నెలకొంది. అయితే తమ జోలికి వస్తే అణుదాడి తప్పదని కిమ్ హెచ్చరిస్తున్నారు.