News August 22, 2025
ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్

బాపట్ల జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ సెక్రటరీ విజయనగరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఎరువుల వివరాలను వారికి వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచి, వారికి అండగా నిలుస్తామని అన్నారు.
Similar News
News August 22, 2025
రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

రాయికల్ మం. అల్లిపూర్‌కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
News August 22, 2025
గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
News August 22, 2025
BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <