News March 24, 2025

ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

image

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.

Similar News

News March 25, 2025

కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

image

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2025

కడప జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం: వాసు

image

త్వరలో జరగనున్న కడప జడ్పీ ఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికల్లో పోటీచేయలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. తమ పార్టీకి సంఖ్యాబలం లేదని అందుకే పోటీ చేయడం లేదన్నారు. అటు చంద్రబాబు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారన్నారు. కాగా కడపలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి 42, టీడీపీ6గా సంఖ్యా బలం ఉంది.

News March 25, 2025

కడప: వాట్సాప్‌లో పదో తరగతి పేపర్ లీక్

image

కడప(D) వల్లూరు సెంటర్‌లో సోమవారం జరిగిన గణితం పరీక్షా పేపర్ లీక్ అయిందని డీఈవో షంషుద్ధీన్ స్పష్టం చేశారు. వేంపల్లె జిల్లా పరిషత్ పాఠశాల బీ కేంద్రంలో తనిఖీలు చేస్తుండగా మ్యాథ్స్ పేపర్ వాట్సాప్‌లో షేర్ అయింది. వల్లూరు స్కూల్లో వాటర్ బాయ్‌ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి పంపాడు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.

error: Content is protected !!