News November 25, 2025

ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

Similar News

News November 25, 2025

కొత్తగూడెం: గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు

image

గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి సరిత తీర్పు చెప్పారు. భద్రాచలంలో 2020 సెప్టెంబర్ 15న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేయగా 10 గంజాయి ప్యాకెట్లతో నిందితులు పట్టుబడ్డారు. రూ.33,97,250 విలువైన 226.500 కిలోల గంజాయితో ఒడిశా, మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన సుజిత్, మనోజిత్ దొరికారు. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువైంది.

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తేదీలివే

image

TG: పంచాయతీ <<18387020>>ఎన్నికల<<>> తొలివిడత నామినేషన్లు ఎల్లుండి(27) నుంచి స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. రెండో ఫేజ్ నామినేషన్లు నవంబర్ 30 నుంచి, మూడో విడత డిసెంబర్ 3వ తేదీ ప్రారంభమవుతాయని వెల్లడించారు. మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని చెప్పారు.