News October 28, 2025

ఎర్రమరెడ్డిపాలెం చెరువును పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సిబ్బందితో డిస్ట్రిక్ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్ బాబు, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సమావేశమయ్యారు. అనంతరం రేణిగుంట సమీపంలోని ఎర్రమ రెడ్డి పాళెం చెరువును పరిశీలించారు. మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News October 29, 2025

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావద్దు: కర్నూలు కలెక్టర్

image

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 -293903కు ఫోన్ చేయాలని సూచించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మరో 3రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 29, 2025

విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

image

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

News October 29, 2025

జిల్లాలో 1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్‌సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.