News May 5, 2024
ఎర్రవల్లిలో నేడు జనజాతర.. హాజరుకానున్న రాహుల్, రేవంత్

నేడు గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాయంత్రం 3.45కి సభా ప్రాంగణానికి రానున్నట్లు సంపత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మంది జనసమీకరణకు నేతలు ప్లాన్ చేశారు. హైవే సమీపంలో సభ ఉన్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని అధికారులకు ఎస్పీ రితిరాజ్ సూచించారు.
Similar News
News December 14, 2025
MBNR: రెండో విడత ఎన్నికలు.. గెట్ రెడీ!

MBNR జిల్లాలోని హన్వాడ(35 GP), సీసీకుంట(18), దేవరకద్ర(18), కోయిలకొండ(44), కౌకుంట్ల(12), మిడ్జిల్(24) మండలాల్లోని 151 GPలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 151 సర్పంచ్ పదవులకు, 1,334 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 13, 2025
MBNR: రెండో విడత.. ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

MBNR జిల్లాలోని 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 151 గ్రామాలు, 255 పోలింగ్ కేంద్రాలు, 1334 పోలింగ్ స్టేషన్లు, 36 సమస్యాత్మక గ్రామాలలో 42 లొకేషన్లు 355 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎస్పీ డి.జానకి అన్నారు. రూట్ మొబైల్స్-49, FST-16, స్ట్రైకింగ్ ఫోర్సులు-5, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు- 5 ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేశామన్నారు.
News December 13, 2025
MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


